25 July, 2026 | 3:27 PM

త్రివేణి పాఠశాలలో ఘనంగా పేరెంట్స్ డే వేడుకలు

25-07-2026 02:56 PM

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాల లో శనివారం పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రీ ప్రైమరీ విభాగపు ఉపాధ్యాయులు తరగతి గదులను అందంగా అలంకరించి తల్లిదండ్రులకు ఘనస్వాగతం పలికారు. తర్వాత వారి పిల్లల పట్ల తీసుకునే శ్రద్ధను ఇతర విషయాలను అందరూ చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ  చిన్న చిన్న క్రీడా పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్లు, సి ఆర్ ఓ  పిల్లలను ఉద్దేశించి  సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, కిడ్స్ ఇన్చార్జి, ఆయా తరగతులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.