భక్తిశ్రద్ధలతో అఖండ హరినామ సప్తాః
10-04-2026 12:00 AM
పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్
నిజాంసాగర్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో ఎన్ని రోజులపాటు నిర్వహించే హరినామ సప్తహ కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిత్యం భజన కార్యక్రమాలతో పాటు, అన్నప్రసాద వితరణ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురువారం నాడు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రజా పండరి, బంజా కంసవ్వ, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.




