2 May, 2026 | 1:07 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పనులను వేగవంతం చేయాలి

10-03-2026 12:39 AM

కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి, మార్చి 9 (విజయక్రాంతి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ప్రగతి ప్రణాళిక పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.శంషాబాద్లోని మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మరియు బస్తీ దవాఖానను సందర్శించారు. రిజిస్టర్ల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని సిబ్బందిని హెచ్చరించారు.

99 రోజుల కార్యాచరణ..

జూన్ 12వ తేదీ వరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో 99 రోజుల పాటు ఈ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.  ప్రతి కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడంతో పాటు, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైన చోట మరమ్మత్తులు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.   కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ జోనల్ కమిషనర్ చంద్రకళ, రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితా దేవి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.