అరైవ్ అలైవ్‌లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు గురువారం ఎల్లారెడ్డి పోలీస్ శాఖ ఎస్ ఐ బొజ్జ మహేష్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని బస్ స్టాండ్ , తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మహేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, మరణాల రేటును అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం , పోలీసులు సంయుక్తంగా ‘అరైవ్ అలైవ్‘ అనే ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
ప్రయాణికులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ఆటో డ్రైవర్లు, భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణిస్తామని ప్రతిజ్ఞ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్ , డి టి శ్రీనివాస్ , ఆర్ ఐ శ్రీనివాస్ , పోలీస్ సిబ్బంది ప్రేమ్ సింగ్, అనిల్ గౌడ్ , పాల్గొన్నారు.






