17 April, 2026 | 3:14 AM

జిపి సరిహద్దులు, విస్తీర్ణం గుర్తించాలని ఎమ్మార్వోకు వినతి పత్రం

17-04-2026 01:39 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మండలంలోని గోపాల్పేట్ గ్రామపంచాయతీ యొక్క సరిహద్దులు విస్తీర్ణాన్ని గుర్తించి వాటి పత్రాలను గ్రామపంచాయతీకి సమర్పించాలని కోరుతూ గ్రామ సర్పంచి వంశీకృష్ణ గౌడ్ ఎమ్మార్వో రాజేశ్వర్కు వినతి పత్రాన్ని అందజేశారు.గోపాల్పేట గ్రామపంచాయతీ 2018 సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది.

గోపాల్పేట జీపీ ఏర్పాటు సమయంలో గ్రామపంచాయతీ ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంతో కూడిన గజిటెడ్ రావడం జరిగింది.కావున ఆ యొక్క ఎనిమిది వందల ఎకరాలను మ్యాప్తో కూడిన వివరాలు జిపికి ఇవ్వాలని కోరుతూ మండల ఇన్చార్జి ఎమ్మార్వో రాజేశ్వర్కు గోపాల్పేట గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గులాం హుస్సేన్, కార్యదర్శులు రాజు ఉన్నారు.