15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజావాణి వినతుల సత్వరమే పరిష్కరించాలి

02-02-2026 08:22 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్ లతో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ప్రజావాణిలో రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్, పౌరసపరాలు, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 91 విన్నతులు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలు సీరియస్ గా పరిగణించి పక్షం రోజుల్లో గా పరిష్కరించాలని, శాఖల వారీగా సమీక్ష నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ ను ఆదేశించారు.

పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, హాస్టలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని, ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వాణ, విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల, అధ్యాపకులు పనితీరు తదితర నివేదిక అందజేయాలని అన్నారు.

స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆర్టీఐ ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖల పిఐఓలతో, డిఆర్ఓ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, డిఆర్డిఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.