అమరవీరుల బహిరంగ సభను విజయవంతం చేయాలి
18-04-2026 07:35 PM
అమరవీరుల ఆశయ సాధన కమిటీ సభ్యులు..
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల సంస్మరణ దినోత్సవం 20వ తేదీన నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని అమరవీరుల ఆశయ సాధన కమిటీ చైర్మన్ మెస్రం నాగనాథ్ అన్నారు. శనివారం ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల స్మారక స్తూపం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరవీరుల ఆశయ సాధన కోసం నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.






