13 July, 2026 | 4:31 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

‘సమస్యల పరిష్కారానికే ప్రజావాణి’

25-03-2025 01:07 AM

మెదక్, మార్చి 24(విజయక్రాంతి)ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణికి 85 దరఖాస్తులు వచ్చాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలోసోమవారం నిర్వహించిన ప్రజావాణిలోడి ఆర్‌ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఆర్జీలలో ధరణి సమస్యలపై 30, పెన్షన్ కోసం 3, ఇందిరమ్మ ఇండ్లు 3, ఉద్యోగ ఉపాధిపై 2, ఇతర సమస్యలపై 47 మొత్తం 85 దరఖాస్తులు ప్రజల నుంచి అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.