20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

ప్రజా సంబంధాలే పార్టీకి పునాదులు

20-07-2026 12:00 AM

మాజీ ఎమ్మెల్యే రాజా రెడ్డి

భూపాలపల్లి, జులై 19 (విజయ క్రాంతి) : ప్రజా సంబంధాలే పార్టీకి పునాదులని నిచ్చెనమెట్ల వ్యవస్థను అంతం చేసి అంతరాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కమ్యూనిస్టులే నిరంతరం పోరాడుతున్నారని సీపీఐ మాజీ ఎమ్మెల్యే రాజా రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు లు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ లో 18, 19 రెండు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. *2 రోజుల పాటు జరిగిన రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం  ఘనంగా ముగిశాయి. 

శిక్షణలో అంశాలు

మొదటిరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మన కర్తవ్యం అనే అంశంపై తక్కలపల్లి శ్రీనివాసరావు, మార్క్సిజం సమకాలిన సమాజంలో దాని ప్రాధాన్యత మధుకర్, తీవ్ర ఆర్థిక సంక్షేపంలో భారతదేశం పర్యవసనాలు యూసుఫ్, రెండవ రోజు పార్టీ కార్యక్రమం సిహెచ్ రాజారెడ్డి, మతం మతోన్మాదం లౌకికవాదం కేంద్రంలో అమలవుతున్న హిందుత్వ జెండా ప్రొఫెసర్ శంకర్ నారాయణ, విప్లవ పార్టీ  ఆవశ్యకత, పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం భాగం హేమంతరావు అనేక అంశాలపై రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్లో వారు బోధించారు.

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై  వారు  ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ప్రశ్నించేది కమ్యూనిస్టులే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతు కమ్యూనిస్టులదేనని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిందని, ప్రజల కోసం భూ పోరాటం నిర్వహించి వేల ఎకరాలు పంచిన ఘనత పార్టీదేనన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిర్మాణం చేసి రాజాకారుల తరిమికొట్టిన ఘనత కమ్యూనిస్టుల అన్నారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పైండ్ల శాంతి కుమార్, సుధాకర్ రెడ్డి,  పరమాండ్ల రాజయ్య, అన్నారపు రాజేందర్, సొతుకు ప్రవీణ్ కుమార్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, యాకుబ్ పాషా స్థానిక నాయకులు పాల్గొన్నారు.