మండల సమాఖ్య అభివృద్ధికి అందరి కృషి అవసరం
ఇన్చార్జి ఏపిఎం దత్తు
నాగిరెడ్డిపేట్,జులై 19 (విజయ క్రాంతి): మండలసమాఖ్య సమావేశం మండల సమాఖ్య కార్యాలయంలో ఇన్చార్జి ఏపిఎం కొమ్మ దత్తు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి ఏపిఎం కొమ్మ దత్తు మాట్లాడుతూ...సమాఖ్యల పనితీరు,సంస్థాగత నిర్మాణం,బ్యాంకు లింకేజి , స్త్రీనిధి రుణాల రికవరీ,రుణాల పంపిణీ గురించి లోకోస్ ఆప్లో సంఘాల వివరాల ఎంట్రీ, అజీవిక రిజిస్టర్,న్యూ ఎంటర్ ప్రైజె స్, ఫాం కార్యక్రమాలలో భాగంగా కోడి, మేక, గొర్రె పిల్లల పెంపకం, అదే విధంగా నాన్ ఫాం కార్యక్రమాలు,స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ తయారీ,మండలంలో స్త్రీనిధి రుణాల రికవరీలో వెనుకబడి ఉన్నందున రుణాల రికవరీ గురించి చర్చించడం జరిగింది.
మండలంలోని వివిధ గ్రామాల్లో సిబ్బంది మరియు సబ్ కమిటీల బృందంచే స్పెషల్ రికవరీ డ్రైవ్ నిర్వహించి ఈనెలలో సుమారు 18 లక్షల పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లు చేయడం జరిగిందనీ ఇన్చార్జ్ ఏపిఎం కొమ్మ దత్తు తెలిపారు. ఇంకా మిగిలిన మొండి బకాయిలను వసూ ళ్లు చేయడాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని మొండి బకాయిలు లేని గ్రామ సంఘం గా నాగిరెడ్డిపేట మండల సమాఖ్యను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు.
ఈవారం లో అన్ని గ్రామాల్లో వృద్ధుల,వికలాంగుల, కిషోర సంఘాలను ఏర్పాటు చేయాలన్నా రు. బాలికలమండల సమాఖ్య ఈసి సభ్యులకు విధులు, బాధ్యతలు,సమాఖ్యల పనితీ రు, పుస్తక నిర్వహణ,నిధుల వినియోగం మొదలగు అంశాలపై సీనియర్ సిఆర్ పిలు శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బెస్త శాంత, కార్యదర్శి మంజుల,కోశాధికారి మమత,సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు అనూష,హైమావతి సీసీలు నజీర్, రవి, సావిత్రి, అకౌంటెంట్ రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.






