8 August, 2026 | 1:30 AM

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం

08-08-2026 12:20 AM

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎస్‌పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. నేరాల నియంత్రణలో రాజీ ఉండదని స్పష్టం చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరిత న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సీసీ కెమెరాల విస్తరణ, సీసీటీఎన్‌ఎస్లో సమయానికి నమోదు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలపై అవగాహన పెంపు, గంజాయి రవాణా, జూదం వంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐ లు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.