8 August, 2026 | 2:05 AM

10న మహా వరుణయాగం

08-08-2026 01:16 AM
  1. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ వద్ద నిర్వహణ
  2. పూర్ణాహుతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు   
  3. తెలంగాణ సుభిక్షం కోసమే..: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : ప్రజల సంక్షేమానికి, రైతుల సౌభాగ్యానికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రకృతి అనుగ్రహ మే ఆధారం. మేఘాలు కరుణిస్తేనే నేల పులకిస్తుంది.. నేల పులకిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయి. రైతు ఆనందమే రాష్ట్ర అభ్యున్నతికి నిజమైన కొలమానం. ఈ మహోన్నత సంకల్పంతో తెలంగాణ ప్రజ ల సర్వతోముఖ శ్రేయస్సు కోసం సీఎం రేవంత్‌రెడ్డి మహా వరుణయాగం తలపెట్టారని నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా మహానదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, రిజర్వా యర్లు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌ని నో వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తెలంగాణపై లేకుండా ఉం డాలని ఆకాంక్షిస్తూ ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

సీఎం సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, సి ద్ధాంతులు, వేదపండితులు ఆగస్టు 10వ తే దీని శుభముహూర్తంగా నిర్ణయించారని తెలిపారు. కృష్ణానది పవిత్ర తీరాన వెలసిన నా గార్జునసాగర్ జలాశయం విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హో మకుండాలు, వేదఘోషల మధ్య అత్యంత వైభవోపేతంగా మహా వరుణయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వేదవేత్తలు, అర్చక బృందం సమక్షంలో రాష్ట్ర సుభిక్షం, రైతాంగ సంక్షేమం, ప్రజల ఆయురారోగ్యా లు, పశుసంపద అభివృద్ధి, ప్రకృతి సమతుల్యత కోసం ప్రత్యేక వేదక్రతువులు నిర్వహి స్తారని తెలిపారు. సాయంత్రం 3.24 గంటలకు జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమా నికి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారని వెల్లడించారు.

ప్రకృతి పట్ల భారతీయ సంస్కృతి చూపిన గౌరవానికి, వేద సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ మహోన్నత వరుణయాగంలో ప్రజలు, రైతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని మంత్రి పిలుపునిచ్చారు.

‘వర్షం అనేది కేవలం నీటి చుక్క కాదని.. అది రైతు ఆశ, భూమి ఊపిరి, తెలంగాణ భవిష్యత్ అని ఆయన అభివర్ణించారు. ప్రకృతి ప్రసన్నమైతే ప్రజల జీవితం పరిపూర్ణమవుతుందని, ఆ దివ్య సంకల్పానికే ఈ మహా వరుణయాగం ప్రతీకగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్బోధించారు.