18-11-2025 12:22:56 AM
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:17ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 160 అర్జీలు అందాయి. ప్రజలు తమ సమస్యలు అధికార యంత్రాంగం ద్వారా తప్పక పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని అదనపు కలెక్టర్ అన్నారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.