1 March, 2026 | 5:33 PM

46 ఏళ్ల తర్వాత స్నేహితుల కలయిక..

01-03-2026 04:09 PM

గుర్తులు నెమరేసుకుంటూ ఆనందోత్సాహంగా సమావేశం

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలనీ గర్ల్స్ హై స్కూల్1981-82 పదవ తరగతి పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల అనంతరం ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. పట్టణంలోని ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

నాలుగు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వారు తెలిపారు. కార్యక్రమంలో పాటలు, ఆటలు, సరదా సంభాషణలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించి, తరగతి గదులు, ప్రాంగణం చూసి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు  ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బాలమ్మ, అధ్యక్షతన నిర్వహించారు. పూర్వ విద్యార్థుల ఈ కలయిక అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.