calender_icon.png 15 January, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలసీ ప్రకారం పత్తి కొంటాం

18-11-2025 12:22:33 AM

జిన్నింగ్ మిల్లుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ర్టంలో పత్తికొనుగోలు విషయం లో అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెచేయడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జిన్నింగు మిల్లుల సమస్యల పరిష్కారానికి చొరవతీసుకోవాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు తెలిపారు. సోమవారం తుమ్మల, తెలం గాణ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, జిన్నింగ్ మిల్ అసోసియేషన్‌కు సంబం ధించిన వారితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

అన్ని సమస్యలు పరిష్కరించుకుని రైతలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీ ప్రకారం పత్తి కొనుగోలు జరుగుతోందన్నారు. తెలంగాణలోని అన్ని జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తికొనుగోలు చేయాలనేది జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ డిమాండ్ అని, దీన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం ఒకవేళ మరిన్ని జిన్నింగ్ మిల్స్ కావాలని ప్రతిపాదిస్తే వాటిని కూడా ఆమోదించాలని నిర్ణ యం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మంగళవా రం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఇతర అధికారులు తెలంగాణకు వస్తారని, అక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో స మావేశం నిర్వహించి పత్తి సేకరణలో ఉన్న ఇబ్బం దులకు దూరం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పత్తి కొనుగోలు విషయంలో రైతు లు ఆందోళన చెందవద్దని, వచ్చే ఏడాది మార్చి వరకు కొంటామని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పం పితే రాష్ర్టంలోని మొత్తం 345 జిన్నింగ్ మిల్లులు కూడా తెరుస్తామన్నారు. జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ తో మాట్లాడి.. సమ్మె విరమింపజేయాలని తుమ్మలను కోరినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. 

ఫిరాయింపులపై ప్రజా తీర్పును కాలరాస్తారా?

తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టు కామెం ట్స్ చేసిందని, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల పట్ల ప్రజల తీర్పును కాలరాసే విధంగా వ్యవహరించడం దుర దృష్టకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. స్పీకర్‌పై రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే నిర్ణయం తీసుకోలేకపోతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ చ ట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

సకాలంలో ఎన్నికలు జరగాలి

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం అయిపోయి స్పెషలాఫీసర్ల పాలన నడు స్తోందని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులు రావాలంటే ఎన్నికలు సకాలంలో జరగాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం నిధు లు గ్రామాలకు అందక అభివృద్ధి పడకేసిందన్నారు. గతంలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని, కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మి గిలిన వారు ఇబ్బందులు పడుతున్నారని పే ర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.