calender_icon.png 18 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారి సమస్య తీర్చాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన

18-11-2025 12:24:28 AM

మహబూబాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): తన ఇంటికి దారి సమస్య పరి ష్కరించాలంటూ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి నిరసనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేటలో చోటుచేసుకుంది. బాధితుడు ధరంసోత్ రవి కుమార్ తన ఇంటికి వెళ్లడానికి ఇతరులు దారి ఇవ్వడం లేదని, సమస్య పరిష్కారం కో సం పోలీస్ స్టేషన్ కి వెళ్తే సివిల్ సమస్య గ్రా మంలో పరిష్కరించుకోవాలని సూచించారని,

గ్రామంలో పెద్ద మనుషుల పంచాయ తీ చేసిన పతికి సమస్యకు పరిష్కారం లభించడం లేదని, దారి సమస్య పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగినట్టు చెప్పా డు. తన సమస్య పరిష్కరించేంతవరకు సెల్ టవర్ నుంచి దిగనని భీష్మించాడు. విష యం గూడూరు తెలుసుకున్న ఎస్త్స్ర గిరిధర్ రెడ్డి ఘటనస్థలికి చేరుకొని సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి సెల్ టవర్ నుంచి దింపాడు.