ప్రభుత్వ ఉద్యోగులపైనా ప్రజా సంక్షేమ బాధ్యత
డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ :
సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు రూపొందించడం మాత్రమే సరిపోదు. ఆ చట్టాలను సమర్థం గా అమలు చేసే వ్యవస్థ, ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల్లో నైతిక విలువలు, ప్రజాసే వా తత్పరత ఉండాలి. మంచి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోపాలుంటే సామాజిక న్యాయం సాధ్యం కాదు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు కేవలం పరి పాల నా యంత్రాంగంలో భాగం మాత్రమే కాకుండా, సామాజిక మార్పునకు వారధు లుగానూ నిలుస్తారు.
భారత్ వంటి విభిన్న సంస్కృతులు, అసమానతలు కలిగిన సమాజంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర మరింత కీలకంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులు, వైద్యులు, అధికారులు, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ సేవకులు సమాజంలో ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమవుతారు. వారి పనితీరు ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తుంది.
అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చదువుకున్న వారు తమ సమాజాన్ని విస్మరించవద్దని, సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చా రు. ఒక సందర్భంలో.. చదువుకున్న వారు తమ సమాజాన్ని మరచిపోతే ఆ సమాజానికి శాపంలాంటి వారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్య వెనుక ఉన్న భావం ఏమిటంటే విద్య, ఉద్యోగం ద్వారా సామాజికంగా ఎదిగిన వ్యక్తులు తమ వ్యక్తిగత అభివృద్ధి తోపాటు సమాజ అభ్యున్నతికీ కృషి చేయా లి. అదే నిజమైన సామాజిక బాధ్యత.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దృష్టిలో ప్రభు త్వ ఉద్యోగులు కేవలం జీతం కోసం పనిచేసే వ్యక్తులు కాదు. వారు రాజ్యాంగం ద్వారా ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలను కార్య రూపంలోకి తీసుకువచ్చే వారధులు. ఒక దేశంలో చట్టాలు ఎంత బలంగా ఉన్నా, వాటిని అమలు చేసే అధికారులు నిబద్ధత తో లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందదని ఆయన విశ్వసించారు. అంబేద్కర్ ‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే భావనను కూడా ప్రతిపాదించారు.
సమాజం ఇచ్చిన అవకాశాల వల్లనే ఒక వ్యక్తి చదువుకుని ఎదుగుతాడు. కాబట్టి.. ఆ వ్యక్తి తన జ్ఞానం, సామర్థ్యాలను తిరిగి సమాజానికి అందించడం అతని బాధ్యత. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నవారు తమ సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని ఆయన ఆశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం, చాలావరకు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.
ఒక నిజాయతీగల అధికారి పేదలకు న్యాయం చేయగలడు. ఒక మంచి ఉపాధ్యాయుడు గ్రామంలో విద్యా స్థాయిని పెంచగలడు. ఒక సమర్థవంతమైన వైద్యుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచగలడు. అందువల్ల సిద్ధాంతపరంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా సామాజిక మార్పుకు ముఖ్యమైన శక్తి.
తెలంగాణలో ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కేవలం పరిపాలనలో భాగస్వాములు మాత్రమే కాకుండా రాజకీయ గమనాన్ని కూడా ప్రభావితం చేసే శక్తిగా నిలుస్తున్నా రు. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని అంచనా. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఇతర విభాగాల ఉద్యోగులను కలుపుకుంటే, ఈ సంఖ్య దాదాపు 6 లక్షలకు పైగా ఉం టుంది. ఈ ఉద్యోగుల కుటుంబ సభ్యులను కలుపుకొంటే దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు ఓట్ల ప్రభావం ఉండే అవకాశం ఉం ది.
అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకంగా శక్తిమంతమైన సామాజిక వర్గంగా నూ పరిగణలో ఉన్నారు. ఉద్యోగుల్లో సుమారు 65 నుంచి 70 శాతం పురుషులు ఉండగా, 30 నుంచి 35 శాతం మహిళలు ఉన్నారు. ఈ వర్గంలో బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు కూడా గణనీయంగా ఉన్నారు. సుమారు 30 శాతం వరకు బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సంఘటితంగా వ్యవహరిస్తే సామాజిక, రాజకీయ మార్పులో కీలక పాత్ర పోషించగలరు.
కాన్షీరాం ఆలోచనలు..
బహుజన రాజకీయాల నిర్మాణంలో కాన్షీరాం ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను ఎంతో చర్చకు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు నేరుగా రాజకీ యాల్లో పాల్గొన కూడదు. అయినప్పటికీ, వారు సామాజిక చైతన్యంలో కీలక పాత్ర పోషించవచ్చని ఆయన విశ్వసించారు. ఈ ఆలోచనతోనే ఆయన ‘బామ్‌సెఫ్’ అనే సం స్థ ఏర్పాటుచేశారు. దీనిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీ సీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉండేవారు.
ఈ సంస్థ ప్రధానంగా మేధోవేదికగా పనిచేసింది. రాజకీయ వ్యూహాలు రూపొందించడం, సిద్ధాం తాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సామాజిక అవగాహన పెంచడం వంటి అంశాల్లో ‘బామ్‌సెఫ్’ సభ్యులు కీలక పాత్ర పోషించారు. తరువాత, సామాన్య ప్రజలను రాజకీయం గా చైతన్యపరిచే వేదికను కూడా ఏర్పాటు చేశారు. కాన్షీరాం దృష్టిలో చదువుకున్న ఉద్యోగులు సమాజంలో ఒక బ్రెయిన్ బ్యాం క్ లాంటి వారు. వారికి రాజ్యాంగం, చట్టా లు, పరిపాలనా వ్యవస్థపై అవగాహన ఉంటుంది.
అందువల్ల వారు సమాజాన్ని సం ఘటితం చేయడంలో, ప్రజలకు దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించగలరు. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ వ్యవస్థపై అవినీతి, పక్షపాతం, జాప్యం వంటి విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం ఉద్యోగుల్లో నైతిక విలువలు తగ్గిపోవడమేనని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తనను పెంపొందించేందుకు కొన్నిమార్గదర్శకాలు ఉన్నాయి.
2007లో రూపొం దించిన పబ్లిక్ సర్వీసెస్ ముసాయిదా బిల్లు లో ఉద్యోగులు రాజ్యాంగంపై విశ్వాసం, నిష్పాక్షికత, నిజాయితీ, పారదర్శకత, ప్రజాసేవా తత్పరత వంటి విలువలను పాటించా లి. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను కేవ లం అధికారిక బాధ్యతగా కాకుండా, సామాజిక బాధ్యతగానూ భావించాలి. ప్రజలకు సేవ చేయడం ప్రధాన ధ్యేయంగా ఉండాలి.
బీసీ వర్గాల రాజకీయ భాగస్వామ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ వర్గాల రాజకీ య భాగస్వామ్యం పెరగాలంటే మేధావులైన ఉద్యోగులు మార్గదర్శకులుగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను రాజకీయంగా చైతన్యపరచడం, ప్రజలకు హక్కు లపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వారు కీలక పాత్ర పోషించవచ్చు. అలాగే రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరిగితే ఉద్యో గులు సంఘటితంగా స్పందించడం అవసరం.
అదే సమయంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్యలను పరిష్కరించే దిశగా మార్గనిర్దేశం చేయాలి. రాజకీయ మార్పు అనేది కేవలం ఎన్నికల రోజు ఓటు వేయడం ద్వారా మాత్రమే సంభవించదు. అది ఒక నిరంతర సామాజిక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక ముఖ్యమైన శక్తిగా నిలుస్తారు. చదువుకున్న ఉద్యోగులు తమ జ్ఞానం, అనుభవం, సామాజిక అవగాహన ను సమాజ ప్రయోజనాలకు ఉపయోగించినప్పుడే, నిజమైన సామాజిక మార్పు సాధ్య మవుతుంది.
బీఆర్ అంబేద్కర్, కాన్షీరాం ఇచ్చిన సందేశం ఇదే. సమాజం ఇచ్చిన అవకాశాలను తిరిగి సమాజాభివృద్ధికి వినియో గించడం ప్రతి చదువుకున్న వ్యక్తి బాధ్యత. ఆ దిశగా ప్రభుత్వ ఉద్యోగులు ముందడుగు వేస్తే సామాజిక న్యాయం బలపడుతుంది. అలాగే, బీసీ వర్గాలు సహా అన్ని అణగారిన వర్గాల రాజకీయ భాగస్వామ్యం పెరిగి ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.
వ్యాసకర్త సెల్: 9177566741




