ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు
19-05-2026 06:57 PM
జమ్మికుంట(విజయక్రాంతి): జమ్మికుంట సీపీఎం పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం 41 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టౌన్ కార్యదర్శి దండిగారి సతీష్ మాట్లాడుతూ... భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ రూపకర్తల్లో ఒకరైన సుందరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో భూస్వామ్య కుటుంబంలో జన్మించి భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి కార్మికుల కోసం పేద ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులను కొనియాడారు.






