ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
19-05-2026 06:52 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట, చిట్టాపూర్ , రాఘవపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను అదనపు కలెక్టర్ లత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కేంద్రాల్లో హమాలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






