15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

28-10-2025 12:00 PM

మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి

మార్కెట్ కమిటీ కార్యాలయంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): పండిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడి అనవసరంగా దళారులకు మీ నష్టపోకూడదని ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి(Market Committee Chairman Rajitha Venkataramireddy) అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో, మార్కెట్ కమిటీ చైర్మన్, రజిత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలి, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తలపెట్టిన విధంగా,ప్రజా ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

న్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు 500 బోనస్ అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500 బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ,ప్రజా ప్రభుత్వం,అని అన్నారు. అందుకోసమే రాష్ట్రంలో సన్నాలు పండించే రైతులను ప్రోత్సహస్తుందని అన్నారు. దీనివల్ల మన రైతుల వద్దనే సన్నాలు కొని మళ్ళీ మనకే సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అందువలన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే పంటను అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. తేమ 17 శాతం ఉండాలని, బస్తా 41 కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, వైస్ చైర్మన్ జొన్నలగడ్డ రాజు,  వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు  గంగారెడ్డి నాగం శంకరయ్యా , రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.