28-10-2025 11:57:31 AM
బెజ్జూర్28,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని(Bejjur Mandal Center) పోస్ట్ ఆఫీస్ అద్దె భవనం ఇరుకుగా ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.పెన్షన్ పంపిణీ చేసే ప్రాంతంలో అద్దె భవనం ఇరుకుగా ఉండడంతో పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నామని తెలుపుతున్నారు.
కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో వృద్ధులు రోడ్లపై కూర్చవలసిన పరిస్థితిగా మారిందని తెలుపుతున్నారు. పెన్షన్ కోసం వచ్చిన సమయంలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితిగా మారిందని తెలుపుతున్నారు.మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ భవనం(Post Office Building) మంజూరు చేయాలని పెన్షన్ లబ్ధిదారులు కోరుతున్నారు,పెన్షన్ పంపిణీ చేసే సమయాల్లో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో పెన్షన్ అందించాలని కోరుతున్నారు. వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఉన్న వారి నిలబద్దకే వెళ్లి పెన్షన్ అందించేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.