calender_icon.png 28 October, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హలో విద్యార్థి చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలి

28-10-2025 12:03:58 PM

బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ 

దేవరకొండ,(విజయక్రాంతి): బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అక్టోబర్ 29నహలో విద్యార్థి చలో కలెక్టరేట్ ముట్టడి(Chalo Collectorate Muttadi) కార్యక్రమం ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ అద్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ కోరారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో(Devarakonda townబొడ్డుపల్లి కృష్ణ  మాట్లాడుతూ... పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

23 నెలలు నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల, పై చదువులకు వెళ్ళడానికి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన చెప్పారు.పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసె వరకు బిఆర్ఎస్వీ తరుపున పోరాటం ఆగదు అని ఆయన అన్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 8150కోట్ల  ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.