calender_icon.png 6 December, 2024 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్వలోకి తోసి కట్టుకథ అల్లి..

10-10-2024 12:06:03 AM

అంగన్‌వాడీని చంపింది భర్తే: పోలీసుల వెల్లడి

నల్లగొండ, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మిర్యాలగూడకు చెందిన అ నూష, వేములపల్లి మండలం ఆమనగల్లు ఆవాసం రావువాగూడేనికి చెందిన సైదులు 16 ఏండ్ల క్రితం ప్రే మ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. అనూష రావువారిగూడెంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తు న్నది.

ఇటీవల వేములపల్లి మండల ం కామేపల్లి అంగన్‌వాడీ కేంద్రానికి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొంతకాలంగా భార్య పై అనుమానంతో గొడవలు పడుతున్నాడు. ఈ నెల 5న కామేపల్లి నుంచి అనూషను బైక్‌పై తీసుకుని ఇంటికి బయల్దేరాడు. రావులపెంట శివారుకు రాగానే సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి వద్ద ఆమెను కొట్టి కాల్వ లో తోసేశాడు.

బైక్‌ను కూడా కాల్వ లో పడేసి బైక్ అదుపుతప్పడంతో తన భార్య గల్లంతైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుటుంబీకులు సైదులు తీరుపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భర్తే నిందితుడని తెలిసందని మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు, వేము లపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.