15 March, 2026 | 12:02 PM

ఆశలన్నీ బడ్జెట్‌పైనే!

15-03-2026 01:45 AM
  1. హెల్త్ స్కీం, డీఏలు, పీఆర్సీ ప్రకటిస్తారా? మళ్లీ ‘చేయి’స్తారా?
  2. పెండింగ్ బిల్లుల కేటాయింపులను రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలంటున్న ఉద్యోగులు
  3. సీపీఎస్ రద్దు హామీ ఏమైందని ప్రశ్నిస్తున్న సంఘాలు
  4. బడ్జెట్ సమావేశాల్లో శుభవార్త కోసం ఎదురుచూపు

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన పెం డింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యో గ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనై నా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఆశగా చూస్తున్న పరిస్థితి ఉం ది. ఈనెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో రా ష్ట్ర ప్రభుత్వం తమకేమైనా తీపికబురు చె ప్పకపోతుందా అని భావిస్తున్నారు.

రెండున్నరేండ్లుగా ప్రభుత్వం తమకు ఇచ్చి న హామీల్లో ఏదైనా ప్రకటించే అవకాశం ఉ న్నట్టు తెలుస్తున్నది. ఉద్యోగులు కోరుకుంటున్న వాటిల్లో ప్రధానంగా క్యాష్‌లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం, పెండింగ్ డీఏ లు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీని ప్రకటించడంతోపాటు కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని కోరుతున్నారు. వీటిని పరిష్కరించాలని రెండు న్నరేండ్లుగా డిమాండ్ ఉంది.

ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతంలో జేఏసీ నేతలు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. అయితే ప్రభుత్వం జేఏసీ నేతల తో చర్చలు జరిపి పలు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడంతోపాటు నెలకు రూ. 700 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులను ఆరేడు నెలలుగా విడుదల చేస్తుండటం తో కార్యాచరణను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

ఇచ్చిన హామీలను ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లుల చెల్లిం పులను రూ.700 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచాలని కోరుతున్నారు. పైగా పెన్షనర్లకు రావాల్సి బకా యిలు ఏక మొత్తంలో చెల్లించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

పెండింగ్‌లో డీఏలు

ప్రభుత్వం ఆరు నెలలకోసారి డీఏ వి డుదల చేస్తామని గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, ఇంకా నాలుగు డీఏలను ఉద్యోగులకు ప్రభుత్వం బాకీపడింది. 01-01-2024, 01-07-2024, 01-01- 20 25, 01-07-2025 వర కు నాలుగు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నా యి. పైగా ఈ ఏ డాది జనవరిలో రావాల్సిన డీఏను కూడా కలుపుకుంటే మొత్తం గా ఐదు డీఏలు పెం డింగ్‌లో ఉన్నట్లవుతుంది. ఇందులో కనీ సం రెండు లేదా మూడు డీఏలను ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగుల ఈహెచ్‌ఎస్ స్కీంను ప్రభుత్వం కొంతకాలంగా నాన్చుతూ వస్తున్నది. ప్ర స్తుతము న్న హెల్త్ కార్డులపై క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగు లకు అందడంలేదు. దీంతో అటు ఉద్యోగు లు, ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎం ప్లాయీస్ కార్డులు ఇవ్వాలని ఫిబ్రవరి 23న ప్రకటిం చింది.

దీనికోసం ఉద్యోగుల నుంచి రూ.528 కో ట్లు సేకరించి అంతే మొ త్తాన్ని ప్రభుత్వం కూడా తన వాటాగా హెల్త్ ట్రస్టు లో జమచేయనుంది. వీటికి సంబంధించిన విధివిధానాలను అమ లు చేస్తూ ప్రభు త్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని, హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆ ర్సీ ఇంతవరకు నోచుకోవడంలేదు.

పీఆర్సీ నివేదిక ఇప్పటికే సిద్ధమైనా కమిటీ నుంచి నివేదికను తీసుకునేందుకు ప్రభు త్వం సిద్ధంగా లేదని తెలుస్తున్నది. ఒకవేళ అది తీసుకుంటే దానిని అమలు చేయా ల్సి వస్తుందని, ప్రభుత్వంపై మరింత ఆర్థికభారం పడుతుందని వెనుకడుగు వేస్తున్న ట్టు ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నా రు. గతేడాది అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీని నియమించి రెండేండ్లు పూర్తయి.. మూడో ఏడాది కూడా నడుస్తున్నది. ఈ మార్చితో దాని గడువు కూడా ముగుస్తుంది.

అప్పట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా ల నేతలు 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని, మరికొందరు 42 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చి అమలు చేయాలని కోరుతూ పీఆర్సీ కమిటీకు విజ్ఞప్తులుచేశారు. ప్రభుత్వమేమో ఆర్థిక కోణంలో ఈ పీఆర్సీని చూ స్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.

కనీనం ఒక శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు ప్ర భుత్వంపై భారం పడుతుందని భావిస్తున్నది. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలుచేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విషయంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో శుభవార్త చెప్పాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌చేస్తున్నాయి.