15 May, 2026 | 9:52 PM

Breaking News

దిగ్గజాలనూ వెనక్కినెట్టి..

18-02-2025 12:00 AM

అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ నటీనటుల జాబితాలో అలియా

నిరుడు టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’ (ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు) జాబితాలో చోటు దక్కించుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. తాజాగా మరోసారి అలాంటి ఘనతే ఆమె కీర్తి కిరీటంలో చేరింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన నటీనటుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారామె.

జెన్నిఫర్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ హైప్ ఆడిటర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో లోపెజ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను వెనక్కినెట్టి అలియా టాప్‌లో ఉండటం విశేషం. అలియా ఇలా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవటం ద్వారా సినీరంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఇన్‌స్టాలో ఈ బ్యూటీని ఏకంగా 8 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ తన సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అలియా అభిమానులతో పంచుకుంటుంటారు. ఫొటోషూట్‌లతోపాటు నిత్యం ఆకట్టుకుంటుంటారు.

అలియా సినిమాల విషయానికొస్తే.. చివరిసారి ‘జిగ్రా’తో పలకరించారామె. ఇదిలా ఉండగా ప్రభాస్ రాఘవపూడి కాంబోలో రానున్న సినిమాలో అలియా యువరాణి పాత్రలో నటించనున్నట్టు టాక్ వినవస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాలోనూ ఆమె నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి.