ఇద్దరు స్టార్ హీరోలకు జోడీగా..
మిస్టర్ బచ్చన్‌త టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది నటి భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికే భాగ్యశ్రీ చేతిలో వరుస సినిమాలున్నాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’. ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ కనిపించనుంది.
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్ఘీస్ నిర్మాతలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. మహేశ్ దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రంలోనూ భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
వీటితోపాటు మరో రెండు ఇద్దరు స్టార్ హీరోలతో భాగ్యశ్రీ జత కట్టనుందని టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి విజయ్ దేవరకొండ తిన్ననూరి కాంబోలో రానున్న ‘కింగ్‌డమ్’లో ఈమెను ఎంపిక చేసినట్టు సమాచారం. అదీగాక ఈ అమ్మడు తాజాగా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్టు వార్తలొ స్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఓ సినిమాలో భాగ్యశ్రీ నటించనున్నట్టు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్టు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా లో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని ఈ ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
ఈ ఏడాది మే నెలలో దీని షూటింగ్ ప్రారం భించనున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన ర్‌పై ఈ సినిమా రానుందని జీవీ ప్రకాశ్ దీనికి సంగీతం అందించను న్నట్టు సినీవర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే రానున్న రోజుల్లో భాగ్యశ్రీ బోర్సే బిజీ హీరోయిన్‌గా మారటం ఖాయం అంటున్నారు అభిమానులు.






