14 July, 2026 | 9:14 PM

'పుష్ప 2' బాక్స్ ఆఫీస్ సునామీ

09-12-2024 01:47 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా దర్శకుడు సుకుమార్‌ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2: ది రూల్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ తుఫాను సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 800 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా తెలిపారు. ఈ చిత్రం ప్రారంభ వారాంతం ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ. 800 కోట్లు (గ్రాస్)ను అధిగమించాయని ఆయన ట్వీట్ చేశారు. పుష్ప 2: ది రూల్ చిత్రం హిందీ వెర్షన్ భారీ రికార్డు కలెక్షన్లు రాబట్టింది.

పరిశ్రమ ట్రేడ్ విశ్లేషకులు పుష్ప 2 మొదటి వారం ముగిసే నాటికి రూ. 1,000 కోట్ల గ్రాస్‌ను దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ ట్రాకర్ సాక్‌నిల్క్ ప్రకారం.. ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.141.5 కోట్లు రాబట్టింది. కేవలం హిందీ వెర్షన్ నుండి మాత్రమే రూ. 85 కోట్లు వచ్చింది. మొదటి నాలుగు రోజుల మొత్తం నికర వసూళ్లు రూ. 529.45 కోట్లు, ఒక్క హిందీ వెర్షన్ రూ.285.7 కోట్లు అందించింది. పుష్ప2 భారీ పాన్-ఇండియన్ కలెక్షన్లను వసూలు చేస్తోంది. పుష్ప 2: ది రూల్ కలెక్షన్ల సునామీ కొనసాగుతున్నందున మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


సినిమా ప్రారంభ వారాంతం నుండి ప్రాంతాల వారీ కలెక్షన్ల వివరాలు 

  • హిందీ: రూ. 285.7 కోట్లు (నికర)
  • తెలుగు: రూ. 44 కోట్లు
  • తమిళం: రూ. 9.5 కోట్లు
  • మలయాళం: రూ. 1.9 కోట్లు
  • కన్నడ: రూ. 1.1 కోట్లు