14 July, 2026 | 9:50 PM

‘విడుదల’ కోసం పోరాటం

09-12-2024 12:55 AM

విజయ్ సేతుపతి, వెట్రి మారన్ కలయికలో రూపొందింది ‘విడుదల -1’ సినిమా. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది ‘విడుదల-2’ మూవీ. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత, శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ నేపథ్యం ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజయ్ సేతుపతి ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. ఈ సినిమాలో పెరుమాళ్ అనే పాత్రలో విజయ్ సేతుపతి అభినయం హైలైట్‌గా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. పెరుమాళ్ పోరాట వీరుడిగా ఎలా మారాడనే విషయాన్ని వెట్రీమారన్ ఈ చిత్రంలో చూపించనున్నారు. మంజు వారియర్, సూరి, భవానిశ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సూర్య సేతుపతి, అనురాగ్ కశ్యప్, రాజీవ్ మీనన్, ఇలవరసు, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా; డీవోపీ: వేల్ రాజ్.