ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టండి
ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్
చేవెళ్ళ, జూన్ 14(విజయక్రాంతి): ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలుతో పాటు పుస్తకాలు, యూనిఫాం లు, స్టేషనరీ విద్యా సామాగ్రి బలవంతంగా విక్రయిస్తూ పేరెంట్స్ వద్ద ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ ఆరోపించారు. చేవెళ్ల మున్సిపల్ అంబేద్కర్ భవన్లో ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.వారు మాట్లాడుతూ.. విద్యను వ్యాపారం చేసి ఇష్ట రీతిగా ఫీజులు పెంచడం బాధాకరమన్నారు.
పుస్తకాలు, యూనిఫామ్స్ కొనాలని యాజ మాన్యం ఒత్తిడి చేస్తున్నరని పేర్కొన్నారు. ఇ ది చట్ట విరుద్దమని విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ దందా అరికట్టాలన్నారు. పుస్తకాలుయూనిఫాంల విక్ర యిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదం డ్రుల ప్రయోజనాలను దృశ్య ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అడ్డుకట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ చేవేళ్ల డివిజన్ స హాయ కార్యదర్శి చరణ్ గౌడ్, చందు, డివిజన్ ఉపాధ్యక్షులు మణికంఠ, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






