17 July, 2026 | 8:14 AM

మతి భ్రమించి మాట్లాడుతున్న ‘పుట్ట’

22-06-2024 03:59 AM
  • మంత్రిని విమర్శించే స్థాయి నీదికాదు
  •  మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాసురేష్‌రెడ్డి

మంథని, జూన్21: జడ్పీ చైర్మన్ పుట్ట మధు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, మంత్రి శ్రీధర్‌బాబును విమర్శించే స్థాయి తనది కాదని మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాసురేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మంథనిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కీచకుడైన కాళేశ్వరం ఎస్‌ఐని కాటారం డివిజన్‌కు తీసుకువచ్చిన విషయం మర్చిపోవద్దన్నారు. లైంగిక వేధింపుల కేసులో కాళేశ్వరం ఎస్‌ఐని  సీఎం రెవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అదేశాల మేరకు విధుల్లో నుంచి పూర్తిగా తొలగించిన విషయం తెలుసుకోని స్థితిలో పుట్ట మధు ఉన్నాడని విమర్శించారు.

పోలీస్‌ల వద్ద డబ్బులు తీసుకొని  పోస్టింగ్‌లు ఇప్పించిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. లాయర్ దంపతుల హత్య కేసులో ఉన్న పోలీసులను రక్షించింది పుట్ట మధు కాదా ఆమె  ప్రశ్నించారు. మంథని నియోజవర్గాన్ని శ్రీధర్‌బాబు అభివృద్ధి చేస్తుంటే కళ్లుమండి విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆమె వెంట వైస్ చైర్మన్ శ్రీపద బానయ్య, కౌన్సిలర్లు ఉన్నారు. ముత్తారంలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు జోలికి వస్తే ఊరుకోబోమంటూ పుట్ట మధును హెచ్చరించారు. కాళేశ్వరం ఎస్‌ఐ చేసిన తప్పులకు పుట్ట మధు బాధ్యత వహించాల్సింది పోయి మంత్రిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. వారి వెంట నాయకులు మద్దెల రాజయ్య, వాజీద్‌పాషా, తటిపాముల శంకర్ ఉన్నారు.