వాడీవేడిగా ఆదిలాబాద్ జెడ్పీ సమావేశం
- సభ్యుల ప్రశ్నలు, అధికారుల సమాధానాలు
- రోడ్లు, పాఠశాల పనుల జాప్యంపై ఎమ్మెల్యేలు, సభ్యుల ఆగ్రహం
ఆదిలాబాద్, జూన్ 21(విజయక్రాంతి): ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన చివరి జెడ్పీ సమావేశం వాడీవేడిగా జరిగింది. సమావేశానికి కలెక్టర్ రాజరిషా, డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి, సభ్యులు, అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సభ్యులు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై నిలదీశారు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర కమిటీల ఆధర్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేయాలంటూ కలెక్టర్ ఆదేశించారు.
ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పలువురు జెడ్పీటీసీలు అటవీ భూముల సమస్యలను లేవనెత్తారు. అధికారులు పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టడంతో పాటు రోడ్ల, వంతెనల నిర్మాణంలో అటవీశాఖ అధికారుల అడ్డంకులతో పనులు నిలిచిపోయాయని సభ్యు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధి చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు రాజకీయాలకతీతంగా సహకరించాలని కోరారు. ఐదేళ్లపాటు సరసభ్య సమావేశాలు సాఫీగా నిరహించేలా సహకరించిన సభ్యులకు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మె ల్యేలను సన్మానించారు.
పోడు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ కోరారు. అవసరమైన చోట్ల బోర్లు వేసేందుకు అనుమతివాలన్నారు. నియోజకవర్గంలోని అనేక మారుమూల ప్రాంతల్లో టీచర్ల కొరత ఉన్నదన్నారు.
రోడ్ల పనుల్లో జాప్యం జరుగుతోంది: ఎమ్మెల్యే కోవ లక్ష్మి
తమ నియోజకవర్గంలో చేపట్టి బ్రిడ్జిలు, రోడ్ల పనులు ఆగిపోయాయని, లోకారి వద్ద రోడ్డు పని అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నదన్నారు. కెరమెరి నుంచి అదిలాబాద్ వయా ఆనార్పల్లి నుంచి వెళ్లే రోడ్డు పూర్తికాలేదని సమావేశంలో పేర్కొన్నారు.
విమానాశ్రయానికి భూమి కేటాయించాలి: ఎంపీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానశ్రయం కోసం ఇప్పటికే 369 ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నదని, మరో 1,500 ఎకరాలను రాష్ర్ట ప్రభుతం అప్పగించాల్సి ఉందని ఎంపీ నగేష్ పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ శాఖ తరగా ప్రతిపాదనలు పంపించాలని సూచి ంచగా, కలెక్టర్ రాజరిషా స్పందిస్తూ గత పది రోజుల క్రితమే సీఎం పేషీ నుంచి ఈ విషయమై ప్రతిపాదనలు అడిగితే పంపించామని తెలిపారు. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరిగిందని, కార్పొరేట్ స్థాయి వైద్యం అందేందుకు స్పెషలిస్టు వైద్యులను రాష్ర్ట ప్రభుతం నియమించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు.






