సింధు శుభారంభం
మలేషియా మాస్టర్స్
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన సింధు టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో బుధవారం సింధు 21 21 స్కాట్లాండ్‌కు చెందిన గిల్‌మోర్‌ను చిత్తు చేసింది. రెండో రౌండ్‌లో సిమ్ యూ జిన్ (కొరియా)తో సింధు తలపడనుంది. 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇతర మ్యాచ్‌ల్లో అష్మిత చలిహ, కిరణ్ జర్జ్ విజయాలు సాధించగా.. ఉన్నతి హుడా పరాజయం పాలైంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సుమిత్ రెడ్డి రెడ్డి జంట రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో ఈ జోడీ 21 12 21 లూ చున్ వాయ్‌గి ఫూ చి యాన్ జంటను చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో సాయిప్రతీక్ జోడీ కూడా ముందంజ వేసింది.






