5 July, 2026 | 12:55 PM

నిఖత్ జరీన్‌కు ఘన సత్కారం

23-05-2024 12:51 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే22(విజయ క్రాంతి): అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న యువ బాక్సర్ నిఖత్ జరీన్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఘనంగా సత్కరించారు. ఇటీవల కజకిస్థాన్ వేదికగా జరిగిన ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీ లో స్వర్ణంతో మెరిసిన నిఖత్ బుధవారం జీహెచ్‌ఎంసీ కమిష నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నిఖత్‌ను సత్కరించిన రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. క్రీడా రంగం అభివృద్దికి జీహెచ్ ఎంసీ కృషి చేస్తోందని అన్నారు. బాలబాలికల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు వేసవిలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్, మహేశ్వర్, బాబురావు సాగర్ తదితరులు పాల్గొన్నారు.