24 April, 2026 | 2:16 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

24-04-2026 12:47 AM

సర్పంచ్ గువ్వల శిరీష వెంకట రమణ

కోదాడ ఏప్రిల్ 23: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని అడ్లూరు సర్పంచ్ గువ్వల శిరీష వెంకట రమణ అన్నారు. గురువారం అడ్లూరు యుపిఎస్ పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, కాపుగల్లు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రామారావు, జడ్. పి.హెచ్.ఎస్ గణపారం ప్రధానోపాధ్యాయు లు డివి, పిఆర్టియు బాధ్యులు అంకులయ్య , పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు యాదగిరి పాల్గొన్నారు.