ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 14: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ అన్నారు.మండల కేంద్రం అర్వపల్లిలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు అనేక రకాల మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని,ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు.
అనంతరం ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో తమ చిన్నారులను చేర్పించాలని చెప్పి నూతన అడ్మిషన్లు జరిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్,ఎంఈఓ బాలునాయక్,ఏఏపీసీ చైర్మన్ సునీతారాంబాబు,హెచ్‌ఎం శ్రీదేవి,ఫిజికల్ డైరెక్టర్ పగిడిమర్రి మల్లేష్,ఉపాధ్యాయులు కోటమర్తి వీరన్న తదితరులు పాల్గొన్నారు.






