ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య

15-09-2026 | 11:56pm

రాజాపూర్: ప్రభుత్వ బడిలో(nment schools) చదివే విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యాబోధన చేస్తారని రాయపల్లి గ్రామ సర్పంచ్ గాయత్రి మల్లేష్ గౌడ్ అన్నారు. మంగళవారం రాయపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు సర్పంచ్ తన సొంత నిధులతో స్కూల్ డ్రెస్సులు, బూట్లు, బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటపాటలతో ఆలాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ బడిలోనే విద్యా బోధన ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివించాలని కోరారు.

మరిన్ని వార్తలు