నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి దామోదర రాజనరసింహ
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాన్ని, మెడికల్ విద్యార్థుల వసతిగృహాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ అని త సిబ్బంది వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు నూతన భవనంలోని భోజనశాల, వసతి గదులు, ఎమర్జెన్సీ, ఆబ్జర్వేషన్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ నూ తన సౌకర్యాలు అటు రోగులకు, ఇటు వైద్య విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైద్య విద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి సమ స్యల ను, ఆసుపత్రికి అవసరమైన నూతన వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్, మద్యానికి బానిసలైన రోగుల సంఖ్య, వారికి అందుతున్న చికిత్స వివరాలపై ఆరా తీశారు. ఇదే క్రమంలో శానిటేషన్, సర్వీస్ కేర్ సిబ్బంది తమ జీతాల పెంపుదలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ వెంకటాచారి, డాక్టర్ క్రిస్టియనో, డిఎంఓ నరేందర్, డిహెచ్ రవీందర్ నాయక్, టి-జుడా ప్రతినిధులు విక్రమ్, చంద్రకాంత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




