30 June, 2026 | 8:47 PM

Breaking News

సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •  

రమాదేవి సేవలు చిరస్మరణీయం

30-06-2026 08:08 PM

టీఎస్‌టిబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందించి, జాయింట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన ఆర్. రమాదేవి సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TSTWTU) జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆమెకు శాలువా, బొకే అందజేసి,  ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె చేపట్టిన కార్యక్రమాల ఫొటోలతో రూపొందించిన ప్రత్యేక ఫొటో ఫ్రేమ్‌ను బహూకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ గిరిజన విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రమాదేవి విశేష కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజనుల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.