3 May, 2026 | 1:29 AM

నకిలీ ధ్రువ పత్రాలు తయారీ గుట్టురట్టు

03-05-2026 12:04 AM

అయిజ, మే 2 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్‌పై రెవెన్యూ అధికారులు దాడి చేసి గుట్టురట్టు చేశారు. శనివారం మండల తహసిల్దార్ ఎన్. జ్యోతి ఆదేశాల మేరకు ఆర్.ఐ రజినీకాంత్ రెడ్డి, జీపీవోలు లక్ష్మీనరసింహ ప్రిం టింగ్ ప్రెస్‌పై దాడులు నిర్వహించారు.

ఈ దాడు ల్లో వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్స్, సర్పంచులు, హెడ్మాస్టర్లు, మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డులు, ఎస్‌ఎస్సి మెమోలు, తదితర నకిలీ ధ్రువ పత్రాలకు సంబంధించిన ముద్రలు రాయలసీమలోని వివిధ జిల్లాలకు సంబంధించిన ముద్రలు, అయిజ మండలంలోని పలు గ్రామాల సర్పంచ్ ముద్రలు, పంచాయితీ సెక్రెటరీ ముద్రలు గట్టు మండలానికి సం బంధించిన మొత్తం 18 ముద్రలు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే కంప్యూటర్‌ని ఓపెన్ చేయగా సుమారు 150పైగా వివిధ పత్రాలు నకిలీవి తయారు చేసినట్టు గుర్తించారు. అనంతరం సీపీవో కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషయమై తహసిల్దార్ మాట్లాడుతూ విశ్వసనీయమైన సమాచారం, ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌తో పాటు జీపీవోలు జ్యోతి, రహమతుల్లా, బాలు ఉన్నారు.