3 May, 2026 | 1:29 AM

జానాగ్రహ సభను విజయవంతం చేదాం

03-05-2026 12:11 AM

బీజేపీ నేత కోలన్ శంకర్ రెడ్డి పిలుపు

 బడంగ్‌పేట్, మే 2 (విజయక్రాంతి): బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తలపెట్టిన జానాగ్రహ సభకు బీజేపీ నాయకు లు, కార్యకర్తలు, అభిమానులు,  శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కోలన్ శంకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం బడంగ్ పేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో  తలపెట్టిన ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ జనాగ్రహ సభకు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

దాదాపు రూ.8 వేల కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదే విధంగా మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు దాదాపు మూడు లక్షల మంది వరకు రానున్నట్లు తెలిపారు. ఈ సభతో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు ఒక గుణపాఠం చెప్పినట్లు అవుతుందన్నారు.

తెలంగాణకు నరేంద్ర మోదీ ఏమి చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తున్న పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం హసకారంతోనే తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్ర పక్షాల కారణంగానే మహిళా బిల్లు ఆమోదం పొందలేదని విమర్శించారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందినట్లయితే, మహిళలకు తగినయం జరిగేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా అభివృద్ధి విరోధులు కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అని ఆయన పండిపడ్డారు. అదే విధంగా ఈ బిల్లు ఆమోదం పొందితే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు 50 శాతం వరకు పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన, కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని శంకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమములో ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, శ్రీహరి చారి, సురేష్, రామిడి మహేందర్ రెడ్డి, భాస్కర్, లక్ష్మణరాజు, తదితరులు పాల్గొన్నారు.