18 April, 2026 | 8:37 PM

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి

18-04-2026 07:23 PM

మహిళా బిల్లును అడ్డుకోవడం దురదృష్టకరం

రామయంపేటలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

రామాయంపేట,(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ మహిళల వ్యతిరేక పార్టీ అని ప్రజలకు అర్థం అయిందని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి నిరసిస్తూ శనివారం రామాయంపేట పట్టణ కేంద్రంలో రాస్తారోకో చేసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాములు మాట్లాడుతూ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా మహిళలు మరింత ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును వ్యతిరేకించడం దురదృష్టకరమన్నారు.

కాంగ్రెస్ పార్టీ వైఖరి యావత్ దేశ మహిళలు చూస్తున్నారని, మహిళల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా పట్టణ అధ్యక్షులు కన్నయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు భాను,రామాయంపేట మాజీ అధ్యక్షుడు దయానంద రెడ్డి, పట్టణ  ప్రధాన కార్యదర్శి అనిల్, భూత అధ్యక్షులు నాగరాజు,  సంతోష్, అనిల్ మరియు మండల ఉపాధ్యక్షుడు శ్యామలాచారి పేట పట్టణ నాయకులు యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు దామోదర్ రావు,  తదితరులు పాల్గొన్నారు.