సెంట్రల్ ఉద్యోగి సన్మానం
నిర్మల్,(విజయక్రాంతి): వాసవి విద్యా సంస్థలో చదివిన పూర్వ విద్యార్థి ఎం.విఘ్నేష్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం జి.ఎస్.టి. & కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించడంతో ఆయనను పాఠశాలలో శనివారం సన్మానం చేశారు . గత సంవత్సరం నిర్వహంచిన SSC CGL-2025 పరిక్షలో ఉత్తీర్ణుడై ఈ ఉద్యోగం సాధించాడని కరస్పాండెంట్ పోతారెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా విఘ్నేష్ మాట్లాడుతూ, తనకు వాసవి స్కూల్ లో లభించిన foundation Education వల్ల తనకు social సబ్జెక్టు పై ఇష్టం పెరిగిందని, దానివల్ల తను civils కి Prepare అయ్యానని తెలియజేశారు. ఈ job చేస్తూనే civils కి Prepare అవుతానని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విఘ్నేష్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోత రెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






