సంభాల్‌కు వెళ్లకుండా రాహుల్, ప్రియాంక అడ్డగింత
ఘాజీపూర్ వద్ద ఉద్రిక్తత
పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ అసహనం
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో తాజాగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకోగా, బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను బుధవారం ఘాజీపూర్ వద్ద పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొం ది. రాహుల్, ప్రియాంక సంభాల్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పా టు చేశారు.
ఢిల్లీ నలుమూలల బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంభాల్‌కు బయల్దేరిన కాంగ్రెస్ నేతలను ఘాజీపూర్ వద్ద నిలువరించారు. రాహుల్, ప్రియాంక వెంట అయిదుగురు ఎంపీల ప్ర తినిధి బృందం కూడా ఉంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శాంతిభద్రతల నేపథ్యంలో బయటి వ్యక్తులను ఈ ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతించేది లేదని పోలీసులు, జిల్లా యం త్రాంగం స్పష్టం చేశారు. డిసెంబర్ 13 వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయని తెలిపారు.
ప్రతిపక్షనేతగా అక్కడికి వెళ్లే హక్కు ఉంది
ఘాజీపూర్ సరిహద్దులో వాహనాలను అడ్డుకోవడంపై రాహుల్‌గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘లోక్‌సభలో ప్రతి పక్షనేతగా సంభాల్‌కు వెళ్లే హక్కు నాకుంది. ఒంటరిగానైనా వెళ్లేందుకు నేను రెడీ. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే. కానీ, ఇందుకు వారు అంగీకరించడం లేదు’ అని రాహుల్ మీడియాకు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. వయనా డ్ ఎంపీ ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది.
ఆయన్ను అక్కడికి వెళ్లేందుకు అనుమతించండని కోరారు. అయినా పోలీసులు అను మతించకపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లారు. సంభాల్‌లోని షాహీ జామా మసీద్ ఉన్న స్థలంలో దేవాలయం ఉందని కొందరు హిందూ పిటిషనర్లు గతం లో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలి చ్చింది. ఈ సర్వే కొనసాగుతున్న సమయం లో అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లు రువ్వి దాడులకు పాల్ప డ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో 5గురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యా యి. దీంతో సంభల్‌లో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు సమాజ్‌వాదీ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో 700 మంది గుర్తుతెలి యని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
అల్లర్ల వెనుక పాక్ ప్రమేయం!
సంభాల్ అల్లర్లపై ఫోరెన్సిక్ దర్యాప్తులో ఓ కొత్త విషయం వెలుగుచూసింది. హింస కు ఉపయోగించిన ఆయుధాలపై మేడ్ ఇన్ పాక్ గుర్తులున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఘటన వెనుక పాకిస్థాన్ ప్రమేయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దర్యాప్తు బృందం (సిట్) హింసాకాండలో పాకిస్థాన్‌కు చెందిన క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది.
నవంబర్ 24న అల్లర్లు జరిగిన స్థలంలో ఐదు ఖాళీ షెల్స్, రెండు క్యాట్రిడ్జ్‌లను (మిస్‌ఫైర్ అయినవి) ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. అవి పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తయారయ్యాయని ఏఎస్పీ తెలిపారు. కాగా ఘటనా స్థలంలో అమెరికాకు చెందిన క్యాట్రిడ్జ్‌లు కూడా లభించినట్లు తెలుస్తోంది.






