26 April, 2026 | 11:33 AM

రైల్వేట్రాక్ పేల్చివేత

03-10-2024 12:27 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: కొంతకాలంగా దేశంలోని అనేక చోట్ల రైల్వే ట్రాక్‌లపై ప్రమాదకర వస్తువులు ఉంచి రైళ్లు పట్టాలు తప్పేలా కుట్రలు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు జార్ఖండ్‌లో ఏకంగా ట్రాక్‌నే పేల్చివేశారు. జాహిబ్‌గంజ్ జిల్లాలోని రంగా గ్రామ సమీపంలో బొగ్గు రవాణా కోసం ఎన్టీపీసీ నిర్మించిన రైల్వేట్రాక్‌లో కొంత భాగాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు పేల్చివేశారని సాహిబ్‌గంజ్ కలెక్టర్ అమిత్‌కుమార్ సింగ్ తెలిపారు.