భద్రాద్రి జిల్లాలో గాలివాన బీభత్సం
- రోడ్లపై కూలిన భారీ వృక్షాలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 14 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పిడులుగు పడ్డాయి. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేల కూలా యి. విద్యుత్తు స్తంభాలు కూలడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం రామయ్య ఆలయంలోని అన్నసత్రంలోకి వరదనీరు చేవడంతో ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని దేవాలయ అధికారులు నిర్ణయించారు. పిడుగుపాటుకు శిల్పానగర్‌లో ద్విచక్రవాహనం దెబ్బతింది. బూర్గంపాడు మండలం మోత గ్రామంలో రోడ్డుపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాల్వంచ మండలం బోజ్యాతండాలో పిడుగు పడి దుక్కిటెద్దు, ఆవు మృత్యువాత పడ్డాయి.
దేవరుప్పుల మండలంలో దంచిన వాన
జనగామ, జూన్ 14 (విజయక్రాంతి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో వర్షం దంచికొట్టింది. గంటపాటు కురవడంతో కుంటలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రామచంద్రాపురం, కోలుకొండ లో వాగులు పొంగిపొర్లాయి. వానకాలం ప్రారంభంలో మొదటిసారి వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తంచేశారు.






