మంచిర్యాల రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు బహుమతి
మంచిర్యాల/కరీంనగర్/నాగర్‌కర్నూల్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్బన్ బ్లడ్ సెంటర్ కేటగిరీలో మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు బహుమతి లభించింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా మంచిర్యాల ఐఆర్‌సీఎస్ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి అవార్డు అందుకున్నారు. 54సార్లు రక్తదానం చేసినందుకు జిల్లాలోని శ్రీరాంపూర్ వృత్తి శిక్షణ కేంద్రం హెడ్ ఓవర్ మెన్ దేవతల రాజ్‌కుమార్ అవార్డు అందుకున్నారు.
జ్యోతిష్మతిలో రక్తదాన శిబిరం
కరీంనగర్‌లోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థులు రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్‌రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు మాట్లాడుతూ.. రక్తదానం చేయ డం గొప్పదని, అన్ని దానాలకన్నా రక్తదానం చేయడం గొప్పదన్నారు. అనంతరం చైర్మన్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
64వ సారి రక్తదానం చేసిన బేతి
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా బీజేపీ నేత, జిల్లా కోర్టు ప్రధాన కార్యదర్శి, న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి 62వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అభినందిం చారు. అలాగే విశ్రాంత ప్రిన్సిపాల్, డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి 58వసారి రక్తదానం చేశారు.
రక్తదాతలు ముందుకు రావాలి
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు రక్తదాతలు ముందుకు రావాలని కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈసంద ర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా బ్లడ్‌బ్యాంకులో రక్తం కొరత ఉన్నదని, విడతల వారీగా జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తనిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.






