రూ.10,182.70 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 14 (విజయక్రాంతి): 2024 సంవత్సరానికి రూ.10,182.70 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి విడుదల చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులు, బ్యాంకర్లతో రైతుల రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖలతోపాటు పలు పథకాలకు సంబంధించిన రుణ లక్ష్య పురోగతిపై డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళిక బుక్‌లెట్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ అవసరాల కోసం 3,673.92 కోట్లు, ఎంఎస్‌ఎంఈ కింద 2,997.06 కోట్లు, విద్యా రుణాలు 44.55 కోట్లు, గృహ రుణాలు 192 కోట్లు, ఇతర రంగాలకు 3275.17 కోట్ల రుణాలను బ్యాంకర్లు అందించాలని ఆదేశించారు. అలాగే 9,927 స్వయం సహాయక బృందాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.64,0 49.25 లక్షలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా రెండో స్థానం సాధించిందని వెల్లడించారు. ఈసందర్భంగా అధికారులు, బ్యాంక ర్లను అభినందించారు. కార్యక్రమంలో డీఆర్‌వో పవన్‌కుమార్, ఎల్‌డీఎం ఆంజనేయు లు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, పరిశ్రమలశాఖ జీఎం నవీన్‌కుమార్, డీఆర్డీవో శ్రీధర్, మెప్మా ఇంచార్జి పీడీ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.






