బోథ్ మండలంలో వర్షం
03-06-2026 03:58 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లుంది. అయితే మొక్కజొన్న జొన్న పంటను మార్కెట్కు తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం నుండి పంటను కాపాడుకునేందుకు సతమతమయ్యారు. మరోవైపు లారీల కొరత ఉండడంతో తూకం వేసి ఉంచిన పంటలను తీసుకువెళ్లడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.






