12 July, 2026 | 5:38 PM

Breaking News

పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •  

వర్షాలు, వడగాల్పులు

15-05-2026 12:00 AM
  1.   3 రోజులు వర్షాలు, 4 రోజులు వడగాల్పులు
  2.   2 నుంచి 3 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 
  3. వాతావరణ కేంత్రం అంచనా

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రోజులు ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మూడు రోజులు వర్షాలు, నాలుగు రోజులు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్ జిల్లా తమ్సిలో 45.1 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది.

శుక్రవారం, శనివారం, ఆదివారం ఉరుములు మెరు పులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు జిల్లాల్లో అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో, ఆదివారం భధ్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడ కురిసే అవకాశముంది.

ఇక ఈ నెల 18న ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల్, పెద్ద పల్లి జిల్లాలో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. 19న ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో, 20, 21వ తేదీల్లో రాష్ట్రం లోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.