18 April, 2026 | 1:36 PM

ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వానలు

30-06-2025 12:39 AM
  1. ఇద్దరు మృతి ఏడుగురు గల్లంతు
  2. 24 గంటల పాటు చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

డెహ్రాడూన్, జూన్ 29: ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బార్‌కోట్ మార్గంలో కొండ చరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతి చెందగా ఏడుగురు గల్లంతయ్యా రు. మరో 10 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి.

ఈ పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నట్టు సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. వరదల వల్ల చార్‌ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్ నగర్ ప్రాంతాల వద్దే యాత్రికులను ఆపాలని సిబ్బందికి  సమాచారం అందించారు.